జగన్ మాత్రం గతంలో ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. గతంలో వైసీపీ తరపున నిలబడి గెలిచిన వాళ్లు పెద్దగా ప్రభావవంతమైన నాయకులు కావడంతో ఇప్పుడు వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఈ పరిణామాలు కూటమికి లాభిస్తాయా? లేదా? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇది కూటమికి మైనస్ అవుతుందా? లేక ప్లస్ అవుతుందా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది.
కూటమి ఎన్ని చేయాలో అన్ని చేసి అధికారాన్ని సొంతం చేసుకుందనే చర్చ సైతం జరుగుతోంది. ఉపఎన్నికల్లో అనుకూల ఫలితాలు కూటమికి తాత్కాలికంగా బెనిఫిట్ కలిగించాయని చెప్పవచ్చు. వైసీపీ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కూటమి లక్ష్యాలను సాధించే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కొన్నిచోట్ల వైసీపీ ప్రతినిధులు గైర్హాజరు కావడం కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. వైసీపీ విషయంలో జగన్ పూర్తిస్థాయిలో దృష్టి పెడితే పరిస్థితులు మారే అవకాశం ఉంది. వైసీపీకి రాబోయే రోజుల్లో అనుకూల ఫలితాలు వస్తాయేమో చూడాల్సి ఉంది. వైసీపీ అంతకంతకూ పుంజుకొని కూటమికి గట్టి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి. సంక్షేమం విషయంలో కూటమి వైసీపీతో పోలిస్తే వెనుకబడిందనే చెప్పాలి. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడితే మాత్రం తమ పార్టీకే విజయం దక్కుతుందని కూటమి ప్రూవ్ చేసింది. రాబోయే రోజుల్లో కూటమి ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.