అసలు పార్టీ ఎందుకు మారారు...? దాని వెనుక ఉన్న మరణం ఏంటి అనే దానిపైన.... క్లారిటీ ఇవ్వాలని... పదిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అసెంబ్లీ లేదా సుప్రీంకోర్టు వేటు వేయకముందే... రాజీనామా చేస్తే ఓ పని అయిపోతుందని అనుకుంటున్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి.
అయితే దీనిపై వారం రోజుల కిందటే ఆయన నిర్ణయం తీసుకున్నారట. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం పోచారం శ్రీనివాస రెడ్డిని అడ్డుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు సీరియస్ కావడం... అలాగే తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా నోటీసులు ఇవ్వడంతో.... పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.
ఇక ఇప్పటికైనా రాజీనామా చేయాల్సిందేనని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారట. ఇవాళ లేదా రేపు... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ మేరకు తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే... మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో వెళ్లి అవకాశాలు ఉన్నాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.