ఐప్యాక్ అనేది దేశంలోనే పొలిటికల్ కన్సలేటింగ్ టీమ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.. గతంలో ఈ ఐప్యాక్ చాలా పార్టీలకు,చాలా రాష్ట్రాలలో పనిచేసింది. 2019, 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ కోసం ఏపీలో గ్రాండ్ వర్క్ చేసింది ఐప్యాక్.. అయితే 2019లో వైసీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకున్నది. కానీ 2024లో ఓడిపోయింది. వైసిపి గెలిచినప్పుడు క్రెడిట్ అంతా కూడా ఐప్యాక్ సంపాదించుకుంది. మొన్న ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఐప్యాక్  టీం ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.



అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. కొంతమంది వైసీపీ నేతలు మీడియా ముందుకే వచ్చి ఐప్యాక్ పైన చాలా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఐప్యాక్  సలహాలు సూచనలు ఆధారంగానే వారి రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇచ్చారని జగన్ వారి మాటలను నమ్మి కొంతమంది లీడర్లు దూరమయ్యారనే విధంగా వార్తలు వినిపించాయి. వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత  ఐప్యాక్ టీం కొంతమేరకు సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ పొలిటికల్ సర్కిల్ లో ఒక న్యూస్ వినిపిస్తున్నది.

అదేమిటంటే ఐప్యాక్ మళ్ళీ జగన్ కోసం ఆంధ్రాలో పనిచేయబోతోందని వైసీపీ నేతలు కూడా వెల్లడిస్తున్నారట. ఫలితాల తర్వాత చాలామంది ఐప్యాక్ మీద విమర్శలు చేశారు.. ఇలాంటి సమయంలో మళ్లీ ఐప్యాక్ రీయంట్రి ఇవ్వబోతోంది అనే టాక్ వైసీపీలోనే కాదు ఇటు ఏపీ అంతటా కూడా చర్చనీయాంశంగా మారిందట. ఈనెల ఆఖరి లేదా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ ఐప్యాక్ వైసీపీ పార్టీ కోసం మళ్లీ బిజీ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గుర్తించి ప్రజల మధ్యకు తీసుకు వెళ్లేలా ఐప్యాక్ పనిచేయవచ్చు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. ఈ ఐప్యాక్ టీంకు శశిరాజ్ ఇన్చార్జిగా చేయబోతున్నారట. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కూటమికి చాలా డ్యామేజ్ ఏర్పడింది. వీటన్నిటిని ఎత్తిచూపే విధంగానే ఐప్యాక్ టీమ్ ప్లాన్ చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: