అదేంటి నారా లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిస్తే ఏపీ రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు కదా..? ఈ సమావేశానికి గులాబీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ కిషోర్ అలాగే నారా లోకేష్ సమావేశం వెనుక... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని... మళ్లీ తీసుకువచ్చేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు గులాబీ పార్టీ వాదిస్తోంది.
ఇందులో భాగంగానే నారా లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ సమావేశమైనట్టు చెబుతోంది గులాబీ పార్టీ. దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో ఇప్పుడు బీసీ కుల గణన పేరుతో... సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు గులాబీ నేతలు. అందుకే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్నతో... సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు వాడిస్తున్నాడని అంటున్నారు. నల్గొండ రెడ్లు, అలాగే బలమైన పోటీదారు అయిన పొంగిలేటిని వీక్ చేసేందుకు... తీన్మార్ మల్లన్న ను వాడుకుంటున్నారట రేవంత్ రెడ్డి.
ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై కూడా రగిలిపోతున్న రేవంత్ రెడ్డి... బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీల సహాయంతో... తెలంగాణలో చక్రం తిప్పే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ఆరోపణలు చేస్తోంది. ఇక దీనికి తెలంగాణలో టిడిపి... సహాయం కావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు... వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే ప్రశాంత్ కిషోర్ అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా... ఏపీ రాజకీయాల కంటే తెలంగాణలో టిడిపి పరిస్థితి పై చర్చించారట. ఇక వీరి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అని అంటున్నారు.