జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత అధికారికంగా పార్టీ  మీటింగ్లో  పార్టీకి సంబంధించినటువంటి  నాయకులందరితో కూడా మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారట. అందులో  చెప్పుకొచ్చినటువంటి ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసినటువంటి అంశాల విషయానికి వస్తే.. సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేయడం విషయంలో చేసిన ప్రకటన ఎన్నికల హామీల విషయంపై చంద్రబాబు వైఖరి మరొకసారి నేతలతో తెలియజేయడం జరిగిందట. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల విషయంలో అమలు చేయడంలో చేతులెత్తేయడమే కాకుండా వాటిని అమలు చేయడానికి ఏవేవో సాకులు చెబుతున్నారు అంటూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారట



అలాగే ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదంటూ పలు రకాల ప్రచారనాలు చేస్తున్నారని.. ఒకవైపు హామీలన్నీ తుంగలో కొట్టడమే కాకుండా మరొకవైపు విద్యుత్ చార్జీల మోత ఇవన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలని.. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ గతంలో ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు కేవలం అప్పులతోనే కాలం గడిపేస్తున్నారంటు వంటి అంశాలను కూడా ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజలలోకి తీసుకువెళ్లాలంటూ వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారట.


అంతేకాకుండా నేతలను ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమవుతూ ఉండాలని పిలుపునిచ్చారట.. ఫీజు ఫోర్ మీద ఈసీ అనుమతి పెండింగ్లో ఉండడంతో వాయిదా వేశామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్లకి తెలియజేశారట. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణం చేస్తూ.. పేద విద్యార్థులను దారుణంగా దెబ్బతీస్తున్నారని కేంద్రం వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు పెంచబోతోందని కానీ చంద్రబాబు మాత్రం కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాశారట.. పేద విద్యార్థుల పక్షాన ఈ అంశాన్ని ఫీజు ఫోర్ లో కూడా భాగం చేద్దామని రాష్ట్రంలో మెడికల్ సీట్లు కుదింపు కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశాలను కూడా ఫీజు పోరులోనే అమలు చేద్దాం అంటూ పిలుపునిచ్చారట. అలాగే ఆరోగ్యశ్రీ ఆగిపోవడం, రాష్ట్రంలో పెన్షన్లను ఏరివేత, పథకాలను అమలు చేయకపోవడం.. 9 నెలల కూటమి పాలన పేదల వ్యతిరేకంగానే జరిగిందని దీనివల్ల ప్రజల ఇబ్బంది పడుతున్నారు అనే అంశాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేలా చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: