ఇందులో భాగంగానే త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి దీనిపై చర్చించనున్నారట. వాస్తవంగా.... దక్షిణ భారత దేశంలో... కూటమిలో భాగంగా బిజెపి ఏపీలో అధికారాన్ని పంచుకుంటుంది. కానీ సింగిల్ గా ఏపీ ఎన్నికల్లో నిలబడితే బీజేపీ కి ఒక్క సీటు రాదని ఒక ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో అటో ఇటో 20 సీట్లు గెలిచే సత్తా ఉంది. తమిళనాడు అలాగే కేరళలో చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి.
అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో బిజెపి ఎదిగిన తరహాలో ఏపీ, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని... బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే పార్టీని బలహీనం చేసేందుకుగాను వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వర్సెస్ డిఎంకె అన్నట్లుగా రాజకీయాలు మొదలయ్యాయి. సనాతన ధర్మం పేరుతో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఎలాగైనా స్టాలిన్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో దించేయాలని బిజెపి వ్యూహాలు రచిస్తోంది. దానికోసం పవన్ కళ్యాణ్ వాడుకోబోతున్నారట. తమిళనాడు రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే ఎన్నికలు ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాల పేరుతో తమిళనాడులో బాగా వేయాలని బిజెపి ఆలోచన చేస్తోంది. అందుకే రంగంలోకి పవన్ కళ్యాణ్ దించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటినుంచి గ్రౌండ్ లో దిగితే అప్పటివరకు సెట్ అవుతుందని ఆలోచిస్తున్నారు.