కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న సీటు చినిగేలా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నేతలను బండబూతులు తిడుతున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దీంతో ఏ క్షణమైనా తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులను ఉద్దేశించి బండ బూతులు తిడుతున్నారు తీన్మార్ మల్లన్న.

 ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిపోర్టును చించి పారేగాలని.. దానిపై మూత్రం పోసి కాల్ చేయాలని తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో తీన్మార్ మల్లన్న పై... కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కులగణనను తీన్మార్ మల్లన్న వ్యతిరేకించిన అంశాన్ని గులాబీ పార్టీ చాలా బాగా వాడుకుంటుంది.

 అసెంబ్లీలో కూడా కేటీఆర్ ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే గులాబీ పార్టీకి ఆ విధంగా మారిన తీన్మార్ మల్లన్న పైన... వరుసగా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి నేతలు... తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డి నేతలపై కూడా... తీన్మార్ మల్లన్న రెచ్చిపోయి మాట్లాడుతున్న తరుణంలో... అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

 ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసి హాట్ కామెంట్స్ చేశారు. మాట్లాడాలనుకుంటే తన కులం గురించి తీన్మార్ మల్లన్న ఎంతైనా మాట్లాడుకొని... కానీ తమ జోలికి రాకూడదని వార్నింగ్ ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే బయటికి వెళ్లిపోవాలని.... తీన్మార్ మల్లన్నకు వార్నింగ్ ఇచ్చారు నాయిని రాజేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న విజయం కోసం రెడ్డి నాయకులు కష్టపడ్డారని... ఇప్పుడు మమ్మల్ని తిట్టడం దారుణం అంటున్నారు. వెంటనే తీన్మార్ మల్లన్న పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: