విదేశాలకు వెళ్లే భారతీయులకు ఈ మధ్యకాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో ఒక విషయంలో... ఫారెన్ వెళ్లే భారతీయ విద్యార్థులు లేదా  ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత... వలసదారులను... ఇండియాకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది వలసదారులను గుర్తించి... అక్కడి ప్రభుత్వం ఇండియాకు పంపిస్తోంది.


అయితే ట్రంప్ బాధ  పడుతున్న ఇండియాకు మరో షాక్ తగిలింది. కెనడా దేశంలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే స్టడీ పర్మిట్లలో... కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది కెనడా ప్రభుత్వం. అంటే విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే స్టడీ పర్మిట్లలో... ఈ సంవత్సరం నుంచి కోత విధించబోతోంది అక్కడి సర్కార్.

 

వలస వచ్చిన విద్యార్థులను టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సంవత్సరానికి గాను... కేవలం నాలుగు లక్షల 37 వేల స్టడీ పర్మిట్ లను  మాత్రమే ఫైనల్ చేసింది కెనడా ప్రభుత్వం. కెనడాలోకి వచ్చే వలసలు అలాగే శరణార్థుల అందరికీ ప్రావిన్స్లవారీగా కేటాయింపులు ఫైనల్ చేసింది కెనడా. అంటే ఈ లెక్కను ఒకసారి పరిశీలిస్తే గత సంవత్సరం కంటే... ఈ సంవత్సరం 10 శాతం తక్కువగా స్టడీ పర్మిట్లను ఫైనల్ చేసింది కెనడా ప్రభుత్వం.

 

ఇప్పుడు ఇదే ఇండియాకు సమస్యగా మారింది. కెనడా దేశంలో ఇతర దేశాల నుంచి చాలామంది రావడంతో నగరాలు అలాగే పట్టణాలలో... ఇండ్ల కొరత స్పష్టంగా ఎదురవుతోందట. అలాగే ఆరోగ్య సంరక్షణ కూడా... సమస్యగా మారినట్లు కెనడా ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారిని కట్టడి చేసేందుకు స్టడీ పర్మిట్ల సంఖ్యను తగ్గించారట. ఇక కెనడా ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా మొత్తం 40 శాతం... కెనడాకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇందులో 10 శాతం కు పైగా మన ఇండియా వారే ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: