అయితే ఇప్పుడు జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా ఒకసారి కలవాలని విజయ సాయి రెడ్డి ప్రయత్నించారు .. ఈ మేరకు బెంగళూరులో కలిసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి .. మీడియాకు తెలియకుండా వ్యక్తిగతంగా ఆయనను కలిసి మాట్లాడాలని భావించారు కానీ జగన్ అవకాశం ఇవక్క పోవటంతో ఆయన సోషల్ మీడియాలోనే వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .. తనతో ఇంతకాలం ప్రయాణించి తన ఎదుగుదల పత్రంలో తన వెంట ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కనీసం ఆయన్ను పలకరించే ప్రయత్నం చేయకపోవడం వైసిపి వర్గాలను కూడా ఆలోచింప చేస్తుంది.
అలాగే విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఎవరికి తెలియని వ్యవహారాలు చాలా జరిగాయని కూడా అంటున్నారు .. విజయసా రెడ్డి రెండోసారి రాజ్యసభ స్థానం వస్తుందని ఎవరు అనుకోలేదు .. అందరూ రాదని అనుకున్నారు .. అయితే భారతీ రెడ్డితో చెప్పించుకుని ఆయన రెండోసారి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని అంటారు.. అందుకే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సీటు వచ్చినప్పుడు రాజీనామా చేసినప్పటి కూడా భారతీ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు .. ఇక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందో కానీ జగన్ విజయసాయిరెడ్డి ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే అంతగా కూడా ఎవరు ఎదురుపడటం లేదు.