డోనాల్డ్ ట్రంప్ వ్యూహాలపై ప్రపంచ దేశాలు అవాక్కవుతున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టి చేపట్టగానే ట్రంప్ తనదైన రీతిలో రెచ్చిపోతూ మందికి దూసుకు పోతున్నాడు. ముందే చెప్పినట్లుగా కెనడా, చైనా, మెక్సికో దేశాలపై టారిఫ్ ల నిబంధనలు విధించాడు. దాంతో ట్రంప్ నిర్ణయంపై ప్రపంచ దేశాలలో అలజడి మొదలైంది. దాంతో ఫ్రీట్రేడ్ (స్వేచ్ఛా వాణిజ్యం)కు అంతరాయం కలుగుతుందని రాజకీయ పండితులు తమ విశ్లేషణలు చెబుతున్నారు. మెక్సికో, కెనడాలతో పాటు చైనా కూడా యూఎస్ పై పన్నులు విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలలో తయారీ రంగంలో ముందున్న చైనాపై సుంకం విధించిన అమెరికా.. ఇండియా విషయంలో మాత్రం ప్రస్తుతానికి అంత కఠిన నిర్ణయం తీసుకోకపోవడం కొసమెరుపు.
 
చాలా దేశాలపై మొండి వైఖరిని చూపిన ట్రంప్ భారత్ పై కూడా చూపిస్తాడని భావించారు. అయితే అమెరికా పర్యటనకు రావాలని భారత ప్రధాని మోదీని ఆహ్వానించడంతో చైనా సహా ఇతర దేశాలు ఇపుడు షాక్ అవుతున్నట్టు ప్రపంచ మీడియా కధనాలు వెలువరిస్తోంది. అమెరికా అధ్యక్షునిగా గెలిచిన తర్వాత జనవరి 27న ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్.. తమ దేశం రావాలని ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇరు నేతలు అక్రమ వలసలు, అమెరికా నుంచి మరిన్ని రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. అదంతా ఒకెత్తయితే మోదీ ఎక్స్ లో ‘‘డియర్ ఫ్రెండ్’’ అని సంబోధిస్తూ.. ఇరు దేశాల అభ్యున్నతికి సంబంధించి కలిసి నిర్ణయం తీసుకుందామని మోడీ రాసుకొచ్చారు.

అదే సమయంలో అమెరికా విదేశాలకు USAID పేరిట సాయాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో భారత్ కి కూడా అమెరికా సాయం చేస్తోంది. దీనిద్వారానే గత సంవత్సరం భారత్ కి 1228 కోట్ల రూపాయిలు అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజా పరిస్థితుల్లో అమెరికా ఆ సాయాలు ఇకనుండి చేయబోనని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిధుల నిలుపువేత భరత్ పైన పెద్దగా ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న అమెరికా పర్యటనకు వస్తున్నారని వైట్ హౌజ్ ప్రకటించడంతో.. ఒకవైపు ట్రేడ్ వార్ నడుస్తున్న క్రమంలో.. మోదీ టూర్ ఎలా ఉండనుందనే ఊహాగానాలు సర్వత్రా మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: