- తన ఓటు తాను వేసుకోని వైసీపీ క్యాండెట్ లక్ష్మి .. !
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పశ్చిమ కృష్ణాలో ఉన్న నందిగామ. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ గత 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక్కడ నుంచి వైసీపీ తరపున మొండితోక జగన్మోహన్‌రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే కుటుంబా నికి చెందిన జగన్ సోదరుడు అరుణ్ కుమార్ కు అప్పటి సీఎం జగన్.. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. నందిగామ మనదే అన్న ట్టుగా పనిచేయాలని ఇద్దరికి సూచించారు. తాజాగా జరిగిన స్థానిక కోటా చైర్ పర్సన్ ఎన్నికలో మాత్రం ఈ ఇద్దరు సోదరుడు చేతులు ఎత్తేసిన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో నే తాజాగా జరిగిన మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో వైసీపీకి చెందిన లక్ష్మి అనే మహిళ.. చైర్ పర్సన్ గా బరిలో నిలిచారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక టీడీపీ అంతర్గత కుమ్ములాటతో వాయిదా పడి మంగళవారం ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన లక్ష్మికి కేవలం మూడంటే మూడు ఓట్లే వచ్చాయంటే ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీ అధికారం లో ఉన్నప్పుడో ఓ రేంజ్ లో హవా చెలాయించి... చైర్ పర్సన్ ఎన్నిక విషయానికి వస్తే.. మాత్రం మొండితోక బ్రదర్స్ కాడి పడేశారు. ఎంత విచిత్రం అంటే చైర్ పర్సన్ గా బరిలో నిలిచిన లక్ష్మి కూడా.. తన ఓటు తాను వేసుకోకుండా.. తటస్థంగా ఉండిపో యారు. దీంతో నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిలబెట్టిన మహిళా అభ్యర్థి చైర్ పర్సన్ గా విజయం సాధించారు. వైసీపీ ఏ మాత్రం ప్రయత్నం చేయక పోవడంతో ఆ పార్టీ పరువు కాస్తా పోయింది.