ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క .. నాలో కూడా మార్పు వచ్చింది నేనేంటో చూపిస్తా .. జగన్ 2.0 ను చూడబోతున్నారు అంటూ మాజీ సీఎం జగన్ సంచల కామెంట్లు చేశారు .. పార్టీ కార్యాలయంలో విజయవాడ వైసిపి  కార్పొరేటర్లతో సమావేశమైన జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు .. విదేశీ టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన జగన్ మొదటిసారిగా  కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి కూటమి నేతలకు హెచ్చరికలు జారీ చేశారని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ రజినీ నటించిన రోబో , రోబో 2.0 సినిమాలు భారీ విజయాలు సాధించాయి .. అయితే రోబో సినిమా కంటే 2.0 భారీ హిట్ అని అంటారు అభిమానులు .. అలా ఇప్పుడు మాస్ డైలాగ్ తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు .. ఇక ఇప్పటినుంచి జగన్ 2.0 చూడటం పిక్స్ అంటూ.. జగన్ రెడ్డి తేల్చి చెప్పారు ..


ఇక జగన్ చెప్పిన ఈ డైలాగ్ ను వైసిపి సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. అయితే ఈ సమావేశంలో జగన్ మరికొన్ని సంచల వ్యాఖ్యలు కూడా చేశారు .. జగన్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ కార్యకర్తలను ఎంతో ఇబ్బందులకు గురి చేసిందని కార్యకర్తల కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు .. వారికోసం ఏమి చేస్తాడో చేసి చూపిస్తాను అంటూ ఆయన అన్నారు .. ఐదేళ్ల అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని జగన్ కామెంట్ చేయడం మరో విశేషం .. అలాగే కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని .. వారిపై ప్రైవేటు కేసులు వేసి వారిని చట్టం ముందు నిలబెడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మనమే అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి జోష్యం చెప్పారు ..


అలాగే రాబోయే 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుందని  .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావటం కామన్ అన్నిటిని తట్టుకొని ముందుకి వెళ్లే శక్త‌ని కార్యకర్తలకు తాను ఇస్తానని రాజకీయంగా మనం ఎదుగుతున్నామని కేసులు పెడుతున్నారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు .. ఇక తాను 16 నెలలు జైల్లో ఉన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని జైలు నుంచి వచ్చిన తర్వాత తను సీఎం అయ్యానంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇక వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతినెలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అమలు చేశానని .. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన  కూటమి ఏ ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చలేదన్నారు .. జనంలోకి కూటమిన్ నేతలు వెళితే అసలు విషయం వారికి బయటపడుతుందని జగన్ అన్నారు .. ఇలా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ మొదటిసారిగా విజయవాడ కార్పొరేటర్లతో ముఖ్య నాయకులతో సమావేశమై ఆయన చేసిన ఈ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలు రేపుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: