ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా కనిపించలేదు. దీంతో తాను విదేశాలలో ఉన్నారనే విధంగా వార్తలు వినిపించాయి.కానీ తాజాగా పవన్ కళ్యాణ్ కు అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ తీవ్రమైన వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల మేరకే పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో జరగానున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేరు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలని పాటుపడుతున్నడంతో పాటుగా అవకాశం చిక్కినప్పుడు అల్లా తన సినిమా డేట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ఇలా పనిచేయడం వల్ల తీవ్రమైన అస్వస్థకు గురయ్యారు అనే విధంగా తాకు వినిపిస్తోంది. అయితే ఈ విషయం అటు అభిమానులను, కార్యకర్తలను సైతం  తెగ ఆందోళనకు గురిచేసిన.. అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి కొంతమంది విశ్రాంతి తీసుకోమంటూ సలహా ఇస్తూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన శాఖలలోని ప్రతి పనిని కూడా చాలా పగడ్బందీగా ఉంచి ముందుకు పరుగులు పెట్టేలా చేస్తూ ఉన్నారు. తన వద్ద ఉన్న శాఖలలో అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేస్తూనే అన్ని రకాల బిల్లులను కూడా పెండింగ్ పెట్టకుండా ముందుకు సాగేలా చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించిన వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక మేరకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి అభిమానులు అనుకుంటున్నాట్టుగానే కొంతకాలం రెస్టు తీసుకొని మరి పొలిటికల్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: