దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మరొకసారి కచ్చితంగా ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుంది అంటూ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేశారు. ఆప్ కి 39 సీట్లు, బిజెపికి 22 సీట్లు వస్తాయనే విధంగా క్లారిటీ ఇచ్చారు.. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు సైతం నేడు పోలింగ్ జరగగా ఈనెల 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు కేకే సర్వే అంచనా వేసిన సర్వేలన్నీ కూడా సక్సెస్ఫుల్గానే సాగాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు పైన కూడా ఈ సర్వే తెలియజేయడంతో అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.మరి ఢిల్లీలో అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 36 రాబట్టాల్సిందే.
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్లో బిజెపి, ఆప్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా కూడా ఢిల్లీలో అధికారం చేపట్టాలని బిజెపి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాగే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నారట.. మరి కాంగ్రెస్ పార్టీ చీల్చేటువంటి ఓట్లు ఎవరు విజయానికి దెబ్బతీస్తాయని విషయం తెలియాల్సి ఉన్నది.. మరి ఇలాంటి సమయంలో ఢిల్లీ ఫలితాలు పైన ప్రతి ఒక్కరు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది ఎనిమిదవ తేదీ వరకు చూడాల్సిందే.