వైసిపి పార్టీ వెంట్రుక కూడా పీకలేరని... మరో 30 ఏళ్ల పాటు వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ను ఏలుతుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తాను బతికుండే వరకు వైసిపి పార్టీ ఉంటుందని వివరించారు. ఎవరు పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. గతంలో మేనిఫెస్టోలోని 90% హామీలు అమలు చేసిన ఏకైక పార్టీ వైసిపి అని గుర్తు చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారని... ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పు మంటున్నారని చంద్రబాబు ప్రభుత్వం పై చురకలు అంటించారు జగన్. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇప్పుడు ఏపీ ప్రజలు బాధపడుతున్నారని వివరించారు. ఇకపై జగన్ 2.0 ను చూడబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ 2.0 కొత్త తరహాలో ఉంటుందని... కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తాను అని ప్రామిస్ చేశారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని వివరించారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత... ఇవ్వలేకపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని కష్టపడుతున్న కష్టాలు అలాగే బాధలను కూడా చూశానని వివరించారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరినీ.. వదలబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.