![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/prashant-kishor-lokesh-minister-ap-politicsbdf46c2d-5de4-4ada-ae44-47c52fd1779b-415x250.jpg)
అయితే ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పైన కావస్తూ ఉన్న ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ తో మంత్రి నారా లోకేష్ కూడా భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా ఒక గంటకు పైగా చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో 2019 ఎన్నికలలో పీకే ఐప్యాక్ టీమ్ వైసిపికి పనిచేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేసిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లో జెన్ సురాజ్ అనే పేరుతో ఒక సొంత పార్టీని సైతం అమలు చేశారు. 2024 ఎన్నికలలో చంద్రబాబుతో కూడా భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ జగన్ ఓటమి ఖాయమని ముందే తేల్చేశారు.
అంతేకాకుండా టిడిపికి పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ టీం లో కూడా కొన్ని వ్యూహాలను కూడా అమలు చేశారట ప్రశాంత వర్మ. అయితే ఇప్పుడు తాజాగా భేటీలో అనంతరం తెలంగాణ ఏపీ రాజకీయాల పైన లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది.. తెలంగాణలో బిజెపితో టిడిపి కలిసి వెళ్లాలని ప్లాన్ చేస్తోందని తెలంగాణలో టిడిపి పార్టీని ఆక్టివ్ గా ఉంచేలా చేయాలని చూస్తున్నారట. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బలం బలహీనతల పైన చర్చలు సాగించినట్లు అలాగే ఏపీలో ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న అభిప్రాయాలను కూడా తెలిపారుట ప్రశాంత్ కిషోర్.
ముఖ్యంగా పథకాల విషయంలో అమలు కాలేదని ప్రజలు వాపోతున్నారని.. నిరుద్యోగులు కూడా కోపంగానే ఉన్నారని, మహిళలపై జరుగుతున్న సంఘటనలు, కరెంటు బిల్లులు పెంపు.. పెన్షన్ తొలగింపు ..అలాగే బిజెపి, పవన్ కళ్యాణ్ రాజకీయాల పైన అలర్ట్ కావాలని సూచించారట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.