ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద... భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి... తాడేపల్లి లో ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో పొగలు రావడంతో... అక్కడే ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ వెంటనే అలర్ట్అయి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.


అలాగే ఫైర్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపింది సెక్యూరిటీ సిబ్బంది. ఈ తరుణంలోనే ఆ మంటలను చక చక ఆర్పేశారు.  దీంతో మంటలు కూడా ఆగిపోయి ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తాడేపల్లి లో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట రోడ్డు... పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో.... కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేశారు.


అయితే... ఆ సిగరెట్  వేయడంతో ఒకసారిగా మంటలు అంటుకున్నాయని సమాచారం అందుతుంది. గడ్డి బాగా ఎండిపోవడం కారణంగా.... ఒకసారి నిప్పు అంటుందట. అనంతరం మంటలు చెలరేగి... జగన్మోహన్ రెడ్డి ఇంటిదాకా వచ్చినట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో.. వెంటనే మంటలు ఆర్పేశారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.


ఈ ఘాటు తన ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం పై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు.... జగన్ ఇంటిలోనే ఉన్నట్లు సమాచారం అందుతుంది. నిన్నటి రోజున.. వైసిపి నేతలతో... తన ప్యాలస్ లోనే సమావేశం అయ్యారట. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు జగన్ మోహన్ రెడ్డి తన ఇంటి నుంచే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టిడిపి కూటమి వేస్తున్న కేసుల పైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: