![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/donaldo-trump-corona-virus29d0f1d0-12fe-4f1c-9fb5-35a92b9f9b9e-415x250.jpg)
అమెరికాలోని కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా టీకాలు, మందుల పరిశోధనల పేరుతో భారీగా నిధులు వెదజల్లుతాయి. అలా చైనాకు కూడా సాయం చేసింది. విషయం ఏంటంటే, ఈ నిధులతోనే చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలు మొదలయ్యాయి. భవిష్యత్తులో రాబోయే రోగాలకు ముందే మందులు కనిపెట్టాలనే పేరుతో మొదలుపెట్టిన ఈ ప్రయోగాలే వికటించాయనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ట్రంప్ కంటే ముందున్న అధ్యక్షుడి హయాంలోనే ఈ నిధులు మంజూరయ్యాయని, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ట్రంప్ ఈ ప్రాజెక్టును ఆపేశారని సమాచారం. అంతేకాదు, దీని వెనుక కీలక సూత్రధారిగా అప్పట్లో ఫౌసీ ఉన్నాడని కూడా గుసగుసలు వినిపించాయి.
ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, వుహాన్ వైరస్ సృష్టించిన సంస్థకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చిందనేది సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. అమెరికన్ యూఎస్ ఎయిడ్ సంస్థ కూడా ఇందులో సగం పెట్టుబడులు పెట్టిందట. ఇప్పటికే యూఎస్ ఎయిడ్ ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు నిధులు ఇస్తుందని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లే బాహాటంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన సంస్థకే డొనేషన్లు ఇవ్వడం చూస్తుంటే, ఈ కుట్ర వెనుక అసలు కథేంటో అర్థం కావడం లేదు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ వైరస్ సృష్టిలో అమెరికా పాత్రపై మీరేమంటారు? ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ముమ్మాటికీ కుట్రేనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి.