తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు...మంత్రి జూపల్లి కృష్ణా రావు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ప్రాధాన్యం లభించడం లేదని, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం సహకరించడం లేదని సన్నిహితుల వద్ద చాలా బాధపడ్డారట మంత్రి జూపల్లి కృష్ణా రావు. ఇక ఇవాళ రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి మీటింగ్ ఉండగా.. నిన్న రాత్రే బెంగుళూరులో కృష్ణ, తుంగభద్రకు నీటి విడుదల విషయమై వెళ్లి ఖర్గేను కలిసి గోడు వెళ్లబోసుకున్నారట మంత్రి జూపల్లి కృష్ణా రావు.
గద్వాల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తనకి కాకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని మల్లిఖర్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారట మంత్రి జూపల్లి కృష్ణా రావు. ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏమిటని అయోమయంలో ఉన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికు భరోసా కల్పించేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు... బెంగళూరు తీసుకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని... సరితను పక్కన బెట్టాలని కోరారట మంత్రి జూపల్లి కృష్ణా రావు. అయితే.. దీనిపై మల్లిఖర్జున ఖర్గే కూడా చాలా సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ తరుణంలోనే... ఇవాళ ఢిల్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంపై రేవంత్ ను ఆడుగనున్నారట కాంగ్రెస్ పెద్దలు.