![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/singer-mangli-tdp-ycp-fire-post-viralminister-ramanaidu7b28176d-d5fa-41f0-b84f-1d633e268320-415x250.jpg)
గత ఐదేళ్లలో వైసీపీ నేతలకు మంగ్లీ చాలా సన్నిహితంగా ఉందని వైసీపీకి ఆమె సపోర్ట్ చేస్తుందని అలాంటి వారికి ప్రోటోకాల్ దర్శనం ఎలా ఇప్పిస్తారని చాలా మంది నేతలతో పాటు పలువురు సీనియర్స్ ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. అంతేకాకుండా మంగ్లీ వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఛానల్ కి సలహాదారుగా పనిచేస్తున్ననీ.. మన జగనన్న అనే పాట పాడి కూడా వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేసింది ఈమె.. చంద్రబాబు కోసం పాటలు పాడమని అడిగితే అసలు తాను పాడనని కూడా తెలియజేసిందని అలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వడం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటూ పలువురు టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం పైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంతేకాకుండా ఈమెకు సంబంధించి కొన్ని పాత వీడియోలను కూడా షేర్ చేస్తూ అడగాల్సింది మంగ్లీని కాదు ఆ రాజకీయ నాయకులను అంటూ పలువురు టిడిపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇప్పటితో సద్దుమణుగుతుందా లేకపోతే సింగర్ మంగ్లీ పైన కూడా రాజకీయ రంగు పులుముకునేలా చేస్తారో చూడాలి మరి.