కొవ్వూరు బీసీ హాస్టల్‌లో మత ప్రార్థనలు కలకలం సృష్టించాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఇదేం తంతు అంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ సమాజ దాతృత్వం, సహనం వారి బలహీనతగా మారిందని అంటున్నారు. మత మార్పిడులు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సైతం మత ప్రచారానికి వేదికలుగా మారుతున్నాయా అనే ఈ ప్రశ్నలు ఇప్పుడు సగటు హిందువును తొలిచి వేస్తున్నాయి.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో హిందూ సమాజంలో కదలిక మొదలైంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడతానని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, వారి ఆశలు చిగురించాయి. పవన్ తమ గొంతుక అవుతారని, తమ సమస్యలపై పోరాడతారని హిందువులు బలంగా నమ్ముతున్నారు.

ఈ నమ్మకాన్ని మరింత బలపరిచేలా, కొవ్వూరు ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాస్టల్ వార్డెన్ ఆధ్వర్యంలోనే అనధికారిక మత ప్రార్థనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. "ప్రభుత్వ హాస్టల్‌లో ఇదేం తంతు" అంటూ హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వార్డెన్ బరితెగింపునకు కారణం ఎవరు అని, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.

వీడియోలో వినిపిస్తున్న మాటలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హాస్టల్ ప్రాంగణంలో మతపరమైన పాటలు, ప్రార్థనలు వినిపిస్తున్నాయని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "ప్రభుత్వ హాస్టల్‌లో మత ప్రార్థనలా? ఇది ఎంతవరకు సబబు?" అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించాలని, జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారు, హిందూ సమాజం పెట్టుకున్న ఆశలను ఆయన నెరవేరుస్తారా, వేచి చూడాలి. ఈ విషయంలో ఆయన విజయం సాధిస్తే పీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: