ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. వైసీపీ నుంచి కూటమి పార్టీలు అయిన టీడీపీ .. జనసేనలోకి భారీ ఎత్తున వలసలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కి చెందిన రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారితో పాటు పలువురు ఎమ్మెల్సీ లు కూడా చివరకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్ కు దూరం అయ్యారు. ఇప్పుడు ఈ లిస్టులో నే మరో ఇద్దరు ఎంపీ లు కూడా ఆ పార్టీని వీడి బీజేపీ లో చేరే ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
సీమకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఒకరు పార్టీ మారే దిశగా పావులు కదుపుతున్నా రట. ఈయన కుటుంబంపై కేసులు వలయం నడుస్తోంది. తమను కాపాడుకు నేందుకే ఈ పెద్ద కుటుంబం బీజేపీని సంప్రదించిందని సీమ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కుటుంబాన్ని పార్టీ లో చేర్చుకునే విషయంలో బీజేపీ పెద్దలు సాగదీత ధోరణి లో ఉన్నారట. ఇక మరో ఎంపీ ఓ పదవి ఆశించి బీజేపీ లో చేరే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ల గా వారు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.