ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోని ఈనాడు పేపర్ ఆర్టికల్స్ చూపించి చంద్రబాబు పరువు తీసిన జగన్... వాళ్లది దొంగలముఠా అంటూ ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పేపర్ వాడుకొని ఏరకంగా ప్రజలను మాయ చేశాడో వివరించిన జగన్.... ఇదంతా ఒక దొంగల ముఠా అని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇవాళ ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి...మాట్లాడారు. తిరుపతిలో ఉపఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆగ్రహించారు. YSRCP కార్పొరేటర్లను పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారని మండిపడ్డారు.  రెడ్ బుక్ రాజ్యాంగంతో గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అంటూ నిలదీశారు వైఎస్ జగన్. కేంద్ర బడ్జెట్ లో చంద్రబాబు సాధించిందేమీ లేదు..పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేశారని మండిపడ్డారు.


పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏ గడ్డి తింటున్నాడని ఫైర్‌ అయ్యారు వైఎస్ జగన్. దావోస్ లో ఒక్క MOU జరగలేదని... చంద్రబాబు పలుకుబడి ఏంటో అర్ధమవుతోందని చెప్పారు. పెట్టుబడిదారులపై కేసులు పెట్టి భయపెట్టారని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టడంతో పెట్టుబడులు మహారాష్ట్ర వెళ్లిపోయాయని ఆగ్రహించారు వైఎస్ జగన్.  


ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు లు రూ.14లక్షల కోట్లని ఊదరగొట్టారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అప్పులు రూ. 10 లక్షలు అన్నారని మండిపడ్డారు. శ్వేతపత్రం విడుదల సమయంలో రూ.12 లక్షల కోట్లు అన్నారని... బడ్జెట్ లో రూ.6,46,531 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారని ఫైర్‌ అయ్యారు జగన్. తొమ్మిది నెలల కాలంలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు..పేదవాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు చేయూత నిచ్చే పథకాలు రద్దు చేయటం విధ్వంసం కదా..అంటూ ప్రశ్నించారు జగన్‌. మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాలరాశారని మండిపడ్డారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: