వైసీపీ మాజీ నేత, విజయసాయిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ పార్టీని వీడిన వారిపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.  మా రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బయటకు వెళ్లారని... రాజకీయాల్లో ఎవరికైనా సరే క్యారెక్టర్ ఉండాలని తెలిపారు.  ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దని కోరారు. విజయసాయి సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని చురకలు అంటించారు జగన్.


అంటే... వైసీపీ మాజీ నేత, విజయసాయిరెడ్డి క్యారెక్టర్‌ లేకనే.. పార్టీ నుంచి బయటకు వెళ్లారని బాంబ్‌ పేల్చారు జగన్‌. మా హయాంలో తాడిపత్రి ఎన్నిక పారదర్శకంగా జరిపామని... హ్యాట్సాఫ్ టు జగన్ అని తాడిపత్రి tdp ఇన్ఛార్జ్ JC ప్రభాకర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు వైఎస్ జగన్. ycp 2.O పాలన ప్రతి కార్యకర్తకు భరోసా గా ఉంటుందని ప్రకటించారు.  ప్రజల్లో తెలుగు దేశం పార్టీ రాదు అని అంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదని పరువు తీశారు జగన్‌.


అసెంబ్లీ సమావేశాలను మేము బహిష్కరించలేదని... అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్ళామని వెల్లడించారు. స్పీకర్ కోర్టుకు స్పందించటం లేదు.... అన్నీ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు జగన్‌. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళు ఏమి చేసుకున్నా వాళ్ళ ఇష్టం.. వాళ్ళు ఏమి చేసుకున్నా మాకు ఓకే అన్నారు. బటన్ నొక్కితే చంద్రబాబుకు ఏమీ రాదు కాబట్టి నొక్కలేకపోతున్నాడు..మంచి జరిగింది అంటే ఒక్క వైసిపి పాలన లోనే అని వివరించారు.


రాజ్యసభకు మాకు 11 మంది ఉన్నారు..వారిలో ముగ్గురు వెళ్ళారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి.. విశ్వసనీయత ఉండాలి..మా నాయకుడు ఫలానా అని కాలర్ ఎగరేసి చెప్పుకోగలగాలని స్పష్టం చేశారు. ఎవరూ పార్టీని వీడినా... తాము మాత్రం.. కార్యకర్తల కోసం పని చేస్తామని ప్రకటించారు. ఇకపై తమ కార్యచరణ వేరుగా ఉంటుందన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: