- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ గవర్నమెంట్ పలు  కీలక నిర్ణయాలు తీసుకుంది .. 21 అంశాలకు క్యాబినెట్ ఆమోదించింది .. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది .. ఇదే క్రమంలో అటు మంత్రులు .. ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చారు .. ఇక ఈ క్యాబినెట్ బేటి తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు .. అలాగే వారికి ఐదు కీలక సూచనలు ఇచ్చారు .. ఇక వచ్చే మూడు నెలల పాటు జనాల్లోకి వెళ్లాలని .. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం చేయాలన్నారు .. గేరు మార్చి శాఖల పరంగా పని మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు .


ఇక అధికారుల కు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం .. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుకు రెడీ కావాలన్నారు . వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని కూడా చెప్పారు .. అదే విధంగా అన్నదాత సుఖీభవ విధివిధానాలు కూడా రైతులకు రూపొందించాలని కూడా చెప్పారు .. అలాగే నకిలీ రిజిస్ట్రేషన్ అరికట్టేలా చర్యలు తీసుకోవాలని .. అలాగే ఏప్రిల్ లో మత్స్యకార భరోసా పై దృష్టి పెట్టాలని కూడా చెప్పారు సీఎం .. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కూడా ఇచ్చారు గేరు మార్చి మంత్రులు ప్రజల్లో నే ఉండాలని మంత్రులకు అల్టిమేట్ జారీ చేశారు .

మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ..

1. వచ్చే మూడు నెలల పాటు మంత్రులు జనంలోకి వెళ్లాలి

2. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి

3. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి

4. మంత్రులు గేర్ మార్చాలి.. పనితీరు మెరుగుపడాలి

5. పెట్టుబడులను పర్యవేక్షిస్తూ ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి

మరింత సమాచారం తెలుసుకోండి: