ఈ కార్యక్రమం తర్వాతే బెంగళూరుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి శైలజనాథ్ వైయస్సార్ హయాంలో తో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించలేదు. గత ఎన్నికలలో సైతం ఆయన పోటీకి కూడా దూరంగానే ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా కూడా మంచి గుర్తింపు ఉన్నది.
శింగనమల నియోజవర్గం అభివృద్ధిలో ఎంతో కొంత ఈయన హస్తం కూడా ఉందని చెప్పవచ్చు. మరి వైసిపి పార్టీకి ఇలాంటి కష్ట సమయంలో వైసీపీ పార్టీలోకి చేరుతున్న శైలజనాథ్కు జగన్ ఎలాంటి బాధ్యతలు సైతం అప్పగిస్తారో చూడాలి మరి. ఇప్పటికే చాలా మంది వైసిపి పార్టీలో ఉండేవారు గుడ్ బై చెప్పి కూటమి పార్టీ వైపుగా అడుగులు వేస్తున్న సమయంలో వైసీపీ పార్టీలోకి చేరేందుకు ఇలా మక్కువ చూపడంతో మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు చేరుతారా అన్న విషయం ఇప్పుడు అందరిని ఆసక్తికరంగా మారేలా చేస్తోంది. అధికార పార్టీ ఏర్పరి కేవలం ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ ఆ పార్టీలోకి కాకుండా ఓడిపోయిన పార్టీలోకి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.