మగాడికి పురుషాంగం ఎంత అవసరమో చెప్పక్కర్లేదు. అయితే.. చిన్నప్పుడే ఇన్ఫెక్షన్‌కు గురై కోల్పోయిన పురుషాంగాన్ని వైద్యులు పునర్నిమించి యధావిధిగా అమర్చిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.  హైటెక్‌ సిటీ మెడికవర్‌ దవాఖాన వైద్యులు ఆ యువకునికి సరి కొత్త జీవితాన్ని అందించారు. అసలు ఈ చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ ఆస్పత్రి వైద్యులు సీనియర్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌, ఆండ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవి కుమార్‌ వెల్లడించారు.

అసలేమైందంటే.. సొమాలియాకు చెందిన యువకుడి(19)కి మత సంప్రదాయం ప్రకారం నాలుగేండ్లున్నప్పుడు సున్తీ చేశారు. అయితే సున్తీ సమయంలో ఇన్ఫెక్షన్‌తో అతని పురుషాంగం కోల్పోయాడు. చివరకు మూత్ర విసర్జన సైతం కూర్చొని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అలా ఎన్నో ఏండ్లుగా అనేక మంది వైద్యులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. అయితే తమ సమస్యతో మెడికవర్‌ దవాఖానకు వచ్చిన ఆ  యువకుడికి యూరాలజిస్ట్‌, అండ్రాలజిస్ట్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ యువకుడికి పురుషాంగంతో పాటు వృషణాలను పునః సృష్టించేందుకు చికిత్స చేశారు.

ఆ  యువకుడి మంజేయికి మైక్రో వాస్క్యులర్‌ సర్జరీ ద్వారా రేడియల్‌ ఆర్జెరీ ఫోర్‌ ఆర్మ్‌ ప్లాప్‌ నుంచి పురుషాంగాన్ని పునః సృష్టించారు. 10 గంటలకు పైగా శ్రమించిన వైద్య బృందం యువకుడి పురుషాంగాన్ని యధావిధిగా అతడికి అమర్చారు. ఇప్పుడు ఆ యువకుడు పూర్తిగా కోలుకుని సాధారణ పురుషుల మాదిరిగానే మూత్ర విసర్జన చేస్తున్నాడు.

గత సంవత్సరం శస్త్రచికిత్సను అతడికి విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందం.. ఇటీవల వారం రోజుల క్రితం యువకుడి పురుషాంగంలో పినైల్‌ ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చారు. ఇక ఆ యువకుడు భవిష్యత్తులో వివాహం చేసుకుని సంసారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దాసరి మధు వినయ్‌ కుమార్‌, తదితరుల వైద్యులు పాల్గొన్నారు. గ్రేట్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: