![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/vijayasai-reddy372df9f5-b1f5-42d4-b48b-b37358805152-415x250.jpg)
వైసీపీలో క్యారెక్టర్ ఉన్న నేతలు మాత్రమే ఉండాలంటూ... బాంబు పేల్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. క్యారెక్టర్ లేని నేతలే భయపడి బయటికి వెళ్తారని... వేరే పార్టీలోకి జంప్ అవుతారని చురకలు అంటించారు. వైసీపీ పార్టీలో ఉన్నామంటే.... ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కూడా... కాలర్ ఎగురవేసుకొని బతకాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అందరిలాగా బయటకు వెళ్లాడని మండిపడ్డారు.
దీంతో విజయసాయిరెడ్డి పై జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే తాజాగా దీనిపై విజయసాయిరెడ్డి కూడా తన స్టైల్ లో స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి మండిపోయేలా కౌంటర్ ఇచ్చారు విజయ సాయి రెడ్డి. తనకు క్యారెక్టర్ ఉందని... క్యారెక్టర్ లేక పార్టీ మారలేదని... చెప్పే ప్రయత్నం చేశారు సాయిరెడ్డి.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత... క్యారెక్టర్ ఉంది కాబట్టే ఎవరి ప్రలోభాలకు తాను లొంగలేదని జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి. భయమనేది నాలో ఏ అనువణువులోనూ లేదు అన్నారు. అందుకే రాజ్యసభ పదవి అలాగే పార్టీ పదవులను కూడా వదులుకున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను జగన్మోహన్ రెడ్డి అపార్థం చేసుకొని అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పకనే చెప్పారు సాయి రెడ్డి. అందరి లాగా తాను అవకాశ వాదిని కాదంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.