ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నది .మద్యం పాలసీలలో ఖరారైన ఒక నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని దీంతో ఎక్సేంజ్ శాఖ వాటిని దిద్దె పరిశీలనలో ఉన్నారట. లైసెన్సులకు ఇచ్చే మార్జిన్ పైన అధికారుల అంచనాలు లెక్క తప్పినట్లు సమాచారం. దీంతో మద్యం తాగే వారందరికి కూడా దీనిపైన కొంతమేరకు భారం తప్పదనే విధంగా ఇప్పుడు ఎక్స్చేంజ్ అధికారులు తెలియజేస్తున్నారు. లైసెన్స్ మార్జిన్ 14% ఇచ్చే విధంగా తాజాగా మంత్రివర్గ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీంతో మార్జిన్ తో కలిపి ఎమ్మార్పీ గా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ.. గతంలో 20 శాతం వరకు లైసెన్సులకు మార్జిన్ ఇస్తామంటూ ఎక్స్చేంజ్ శాఖ ప్రకటించింది. కానీ వాస్తవంగా చూస్తే 10% మార్జిన్ వస్తుందని వ్యాపారులు లాభాలు రాకపోవడంతో ఆందోళన చెందుతూ ఉండడంతో తాజాగా సరికొత్త సవరణలు తీసుకోవచ్చారట..మార్చి పెంచటంతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందని.. దీని నష్టాన్ని భర్తీ చేసేందుకు మద్యం ధరలను పెంచేలా చూస్తున్నారట. ఎమ్మార్పీ మీద 150 రూపాయలు దాటిన ప్రతి బ్రాండ్ పైన రూ .10 రూపాయలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారట..99 రూపాయల బ్రాండ్ మినహాయింపు అన్ని బ్రాండ్ల పైన రూ.రూపాయల వరకు పెంచబోతున్నారట.. ప్రస్తుతం 10 శాతం ఉన్న మార్జిన్ ని 14 శాతం వరకు పెంచారట. దీంతో సుమారుగా 320 కోట్ల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందట.