జగన్ సోదరి షర్మిల ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే షర్మిల విషయంలో సంచలన ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా ఉన్నారు. జగన్, షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించి విబేధాలు తలెత్తడంతో షర్మిల జగన్ కు దూరంగా మెలుగుతున్నారు.
 
అయితే కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు షర్మిలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని సమాచారం అందుతోంది. షర్మిల కాంగ్రెస్ ఆస్తులను తాకట్టు పెట్టి రుణం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల గురించి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. షర్మిలపై ఇలాంటి ఆరోపణలు వస్తే అమెకు తీవ్రస్థాయిలో నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
 
మరోవైపు కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జా సోషల్ మీడియ వేదికగా ఒకింత సంచలనం అయింది. ఈకేవైసీ కోసమే సొసైటీ రిజిష్టర్ చేశామని అంతకు మించి మరే కారణం లేదని చెబుతున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. షర్మిలకు వరుస షాకులు తగులుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
షర్మిల మాత్రం తనపై వ్యక్తమవుతున్న విమర్శల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. షర్మిల కెరీర్ పరంగ అంతకంతకూ ఎదిగి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షర్మిల రాజకియాలలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల భవిష్యత్తులో కాంగ్రెస్ లోనే కొనసాగుతారో మరో పార్టీకి ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది. షర్మిల కెరీర్ ప్లాన్స్ ఒకింత గందరగోళంగా ఉన్నాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను అభిమానించే వాళ్ల కంటే ఆమెను వ్యతిరేకించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







మరింత సమాచారం తెలుసుకోండి: