ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22 ,23వ తేదీల్లో ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు జరగబోతున్నాయి .. రెండు రోజులపాటు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వారికి సభ నియమాలను సభలో సభ్యుల పనితీరు వ్యవహార శైలి సభ మర్యాదలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు .. ఇక తొలి రోజు ఎమ్మెల్యేల అవగాహన తరగతులు కార్యక్రమాన్ని భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అమరావతికి ఓం బిర్లా వస్తారా లేదా వర్చువల్‌గా పాల్గొంటారు అనే విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది .. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరై అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్నత సంతరించుకున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా.. ఏ ఎమ్మెల్యే అయినా సరే.. సెలవు కోసం అనుమతి తీసుకోకుండా 60 రోజుల పాటు సభకు రాకపోతే అనర్హత వేటు వేయవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యే ఎవరైనా సరే సరైన కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలని .. అలా దరఖాస్తు చేయకుండా 60 రోజులు శాసనసభకు రాకుంటే చట్టప్రకారం ఆ ఎమ్మెల్యేపై వేటు వేయవచ్చని రఘురామ అన్నారు. ఒకవేళ వైఎస్ జగన్ అలా రాకుంటే.. పులివెందులకు ఉపఎన్నిక వస్తుందంటూ అభిప్రాయపడ్డారు .