![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/tdp-ap-thirupoor-mla-kolikapoodi-srinivasaraoc83cd0ac-0146-43ea-81e4-66e2dad15b58-415x250.jpg)
అసలు విషయంలోకి వెళ్తే ఎమ్మెల్యే వేధింపులు తాగలేక టిడిపి కార్యకర్తలలో ఒకరైన డేవిడ్ నిన్నటి రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారట.. ఈ విషయం కొంత మేరకు ఆలస్యంగా వచ్చిన పార్టీ కోసం కష్టపడిన తనను ఇలా అక్రమ కేసులతో వేధిస్తున్నారు అంటూ ఒక సెల్ఫీ వీడియో ని కూడా విడుదల చేశారట డేవిడ్. దీంతో ప్రస్తుతం డేవిడ్ విజయవాడలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట. అయితే కోలికపూడి ఈ వీడియోను కూడా బయటికి రాకుండా ఉండేందుకు నిన్నటి నుంచి అందరిని బెదిరిస్తున్నారని ఆరోపణలు కూడా ఇప్పుడు ఏపీ అంతట వినిపిస్తూ ఉన్నాయి.
మరి ఇలా టిడిపి నేతలే తమ కార్యకర్తలను వేధిస్తూ ఉండడంతో చాలామంది ఈ ఎమ్మెల్యే పైన ఫైర్ అవుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా మహిళల పట్ల ప్రవర్తించిన తీరు పైన కూడా ఆగ్రహాన్ని తెలియజేశారు. తిరుపూర్ ప్రజా సమస్యలను కూడా గతంలో తీరుస్తాను అంటూ గుంతల పడిన రోడ్లు నిలబడి కూటమి ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించడం జరిగింది.. ఇలా ఎన్నెన్నో వాటిని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ ఈ ఎమ్మెల్యే కి చేటు తెచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. మరి కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం పైన ఈ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.