ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "మన మిత్ర" పేరుతో సరికొత్త వాట్సాప్ సేవను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు సింపుల్‌గా 9552300009 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, ఏకంగా 150 ప్రభుత్వ సేవలు మీ అరచేతిలో ఉంటాయి. ఇంతకుముందు ఈ సేవలు తెలుగులో మాత్రమే ఉండగా, ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అందుబాటులోకి వచ్చాయి.

చాలామందికి టైప్ చేయడం రాదు, వారి కోసమే ప్రభుత్వం మరో అదిరిపోయే అప్‌డేట్ తీసుకొస్తోంది. త్వరలోనే వాయిస్ మెసేజ్ ద్వారా కూడా "మన మిత్ర" సేవల్ని పొందవచ్చు. చదువు రాని వారు కూడా ఈజీగా ప్రభుత్వ సేవల్ని వాడుకోవచ్చు.

ఇంకా చాలా సర్వీసులు రాబోతున్నాయి. మన మిత్రలో మరిన్ని సేవల్ని యాడ్ చేసేందుకు ప్రభుత్వం ఫుల్ స్వింగ్‌లో పనిచేస్తోంది. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలోకి మార్చేస్తోంది. ప్రతి శాఖకు టార్గెట్ ఫిక్స్ చేశారు. వాట్సాప్ ద్వారా ఎక్కువ సేవలు అందిస్తే పని ఫాస్ట్ అవుతుంది, లంచాలు ఉండవు, ఆఫీసులకు తిరగాల్సిన కష్టం తప్పుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది.

డిజిలాకర్ కూడా ఏపీలోకి వచ్చేస్తోంది. డిజిటల్ సేవల్ని మరింత పర్‌ఫెక్ట్ చేయడానికి, ప్రతి ఒక్కరికీ డిజిలాకర్ ఇవ్వాలని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో మీ సర్టిఫికెట్స్ అన్ని సేఫ్‌గా దాచుకోవచ్చు. ఒక్కసారి డిజిలాకర్‌లో సేవ్ చేసుకుంటే చాలు, డాక్యుమెంట్స్ ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మీ చేతుల్లో ఉంటాయి. మళ్లీ మళ్లీ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన టెన్షన్ ఉండదు.

కంప్లైంట్స్ కూడా ఇక వాట్సాప్ ద్వారానే చెప్పొచ్చు. ప్రభుత్వ డేటా మొత్తం వాట్సాప్‌కు లింక్ చేయబోతున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్‌ను పెట్టి, కంప్లైంట్స్ వెంటనే సాల్వ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ గారు మాట్లాడుతూ, ఈ డిజిటల్ సేవలు సక్సెస్ కావాలంటే డేటా కనెక్టివిటీ చాలా ముఖ్యం అన్నారు. అప్‌గ్రేడ్స్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇకపై మీ సర్టిఫికెట్స్ పోయినా, మర్చిపోయినా టెన్షన్ లేదు, మొబైల్ ఉంటే చాలు, అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: