ప్రపంచంలో పెళ్లిళ్లు రకరకాలుగా జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, సంప్రదాయం పాటిస్తుంటారు. కొన్ని పెళ్లి ఆచారాలు, సంప్రదాయాలు వింతగా అనిపిస్తే, మరికొన్ని విస్మయం కలిగిస్తాయి. కానీ కంబోడియాలోని ఓ తెగ వివాహ పద్ధతి గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొనాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి ఆచారం అసలు ఎక్కడా ఉండదు కూడా. ఎవరు కూడా పెళ్లికి ముందు శృంగారం చేయడాన్ని తప్పుగా భావిస్తారు.

కానీ కంబోడియాలోని రతనకిరి రాష్ట్రంలో నివసిస్తున్న క్రేవుంగ్ అనే తెగ ప్రజలు మాత్రం ఇది సర్వసాధారణ విషయం. ఈ తెగలో పెళ్లికి ముందు శృంగారం అనేది తప్పనిసరి ఆచారం. అమ్మాయికి 13 ఏళ్లు రాగానే పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పటి నుంచి ఆమె తన ఇష్టానుసారం జీవించవచ్చు. ముఖ్యంగా నచ్చిన వారితో శారీరక సంబంధం పెట్టుకునేందుకు కూడా అనుమతి ఉంది. ఆ తరువాత, ఎవరితో అయితే శృంగారంలో పాల్గొందో, వారినే పెళ్లి చేసుకోవచ్చు లేదా ఇంకొకరిని కూడా ఎంచుకోవచ్చు.

ఈ ఆచారం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పెళ్లి చేసుకునే ముందు ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఎంతవరకు సరిపోతారో తెలుసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఒకవేళ శృంగారం తర్వాత ఆ జంటకు ఒకరిపై ఒకరికి ఆసక్తి లేకపోతే, వారు విడిపోవచ్చు. దీనివల్ల పెళ్లి తర్వాత విడాకులు తీసుకునే సమస్య తప్పుతుందని క్రేవుంగ్ ప్రజలు నమ్ముతారు.

ఇలాంటి వింత ఆచారాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కో సంస్కృతికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. క్రేవుంగ్ తెగ ప్రజల ఈ వివాహ సంప్రదాయం వారి జీవన విధానంలో భాగం. ఇది వారి సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మోడ్రన్ సొసైటీలో జీవించేవారు కూడా ఇంత ఓపెన్ గా శృంగారాన్ని ఒప్పుకోరు. దీనిని తప్పుగానే చూస్తారు కానీ ఈ తెగ ప్రజలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకా తెగల ప్రజలు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారు ఆలోచిస్తుంటేనే వింతగా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: