అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో... ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే సిసోడియా... ఇద్దరు బడా నేతలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో... ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే సిసోడియా ఇద్దరు కూడా... వెనుకంజలో ఉన్నారట. ఈ ఇద్దరు అభ్యర్థుల పైన బిజెపి అభ్యర్థులు ఇద్దరు లీడింగ్ లోకి వచ్చినట్లు సమాచారం అందుతుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడతాయని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ అలాగే సిసోడియా కూడా... వ్యతిరేకతను మూటగట్టుకుని.. పోస్టల్ బ్యాలెట్ లో వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే... బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత అరవింద్ కేజీలు అలాగే సిసోడియా ఇద్దరు కూడా లీడింగ్ లోకి వస్తారని... మరి కొంతమంది అంచనా వేస్తున్నారు.
జంగుపురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి... సిసోడియా పోటీ చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. అయితే ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి... అతిసీ కూడా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఆప్ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 36. అన్ని సర్వే సంస్థలు బిజెపికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చాయి.