తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరో ట్విస్ట్‌ నెలకొంది. ఇక తెలంగాణలో మంత్రి పదవులు మరికొంత మందికి వస్తాయని.. అందరూ చూస్తున్న నేపథ్యంలోనే.. వారి ఆశలపై సీఎం రేవంత్‌ రెడ్డి బాంబ్‌ పేల్చారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనని తేల్చి చెప్పారు. తెలంగాన మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై అధిష్ఠానానిదే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.


ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామని ప్రకటించారు. నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  కుల గణన ఆషామాషీగా చేసింది కాదని వివరించారు. ఎంతో పకడ్బందీగా చేసామని గుర్తు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  పిసిసి కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి....  ఈ రోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు.


రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని... వివరించారు. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని వివరించారు. కులగణన ఆషామాషీగా చేసింది కాదు..ఎంతో పక్డబందిగా చేసామని ప్రకటించారు. బిసిలు ఐదున్నర శాతం పెరిగారు. మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు.


పిసిసి కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చింది..ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని వివరించారు.  తెలంగాణ కేబినెట్ విస్తరణ కు మరికొంత సమయం పట్టే అవకాశం అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.  మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్ణయం అన్నారు. నేను ఎవరిని సిఫార్సు  చేయడం లేదని వివరించారు.  ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అర్జెంట్ గా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే ఆలోచన నాకు లేదన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: