దేశమంతా ఎన్నికలు ఒక లెక్కైతే ఢిల్లీలో ఎన్నికలు మరో లెక్క, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎన్నికలు జరిగినప్పుడల్లా జనాలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ఈ తరుణంలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడిందట. ఇక కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉండబోతోంది. ఇప్పటికే ప్రచారంలో అన్ని పార్టీల అగ్ర నేతలను పిలిపించుకొని మూడు సభలు, 6 స్పీచ్ లు అనే విధంగా నడిపించారు. అలాంటి ఈ తరుణంలో గత రెండు పర్యాయాల నుంచి  పూర్తిస్థాయి అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఢిల్లీలో చతికిలపడబోతోందట. ఇప్పటికే వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా అన్ని పోల్ సంస్థలు  బిజెపి పార్టీ వైపు మొగ్గు చూపాయి. ఒకటి రెండు ఆమ్ ఆద్మీ గెలుస్తుంది అని చెప్పింది..

 కానీ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎన్నికల ఫలితాలు చెప్పడం ఈ మధ్యకాలంలో కష్టతరం అవుతోంది.. జనాలు ఓటు వేస్తున్నారు తప్ప ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎలాంటి రిజల్ట్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో  36 సీట్లు గెలిస్తే పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. అయితే ఈ క్రమంలోనే ఢిల్లీలో బిజెపి 28 స్థానాలు, ఆప్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ ఇదే విధమైనటువంటి ఫలితాలు ఇంకా కొన్ని గంటల వరకు సాగితే మాత్రం తప్పకుండా ఢిల్లీలో బిజెపి గెలిచే అవకాశం ఉంటుంది.

 గత 25 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారానికి దూరమైనటువంటి బిజెపి ఈసారి చాలావరకు ప్రజల మనసు గెలుచుకున్నట్టు   సమాచారం. అంతేకాకుండా కేజ్రీవాల్ పై    వచ్చినటువంటి పలు అవినీతి ఆరోపణలు వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త వెనుకబడిపోయిందట.. అంతేకాకుండా కేంద్రంలో బిజెపి ఉంది కాబట్టి ఇక్కడ బిజెపి గెలిస్తే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందని డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ప్రజలు కూడా భావించినట్టు సమాచారం.. మరి చూడాలి పూర్తి ఫలితాలు వెలువడే వరకు ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం..

మరింత సమాచారం తెలుసుకోండి: