![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/roja-ycp-nagari-ex-minister-arrest-cm-chandrababu67f1cd53-cf6e-4c56-96b7-65b8fdbf74e3-415x250.jpg)
రోజా గత రెండు రోజులుగా రాజధాని అమరావతిలో ఈ విషయం పైన డెబిట్ నడుస్తూ ఉన్నది ఆడుదాం ఆంధ్ర పోటీలలో కూడా రోజా అవినీతి చేశారనే విధంగా రూ .100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఒక వ్యక్తి ఆమెపైన సిఐడి కి ఫిర్యాదు చేశారట.. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి రోజా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబు నుంచి అనుమతి వస్తే ఈమెను అరెస్టు చేయబోతున్నట్లు ఏపీ రాజకీయాలలో చర్చలు జరుగుతున్నాయట.
మరి ఈ విషయం పైన చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. చంద్రబాబు ఆయన కుటుంబం పైన గతంలో కూడా ఎన్నోసార్లు రోజా ఫైర్ అయ్యింది.. మరి ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని అరెస్టుకు సిగ్నల్ ఇస్తారా లేకపోతే మహిళల పైన వివక్షత ఎందుకులే అని వదిలేస్తారా.. అన్నది చూడాలి ముఖ్యంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం డ్యామేజ్ చాలా జరిగినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో మరి ఇలాంటి సమయంలో మహిళల అరెస్టును ఏ విధంగా సీఎం చంద్రబాబు ఆలోచిస్తారో చూడాలి. గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.