ప్రతి రౌండ్ లోను బిజెపి పార్టీ లీడింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది భారతీయ జనతా పార్టీ. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ లో ఇప్పటికే 39 స్థానాలలో లీడింగ్ లోకి వచ్చింది బిజెపి పార్టీ. ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 36 స్థానాలు ఉండాలి. అంటే ఇప్పటికే 39 స్థానాలలో బిజెపి ముందంజలోకి వచ్చింది. ఇది లీడింగ్ మరో గంట పాటు కొనసాగితే... ఢిల్లీ పీఠాన్ని 26 సంవత్సరాల తర్వాత కైవసం చేసుకోనుంది బిజెపి పార్టీ.
అప్పుడప్పుడు 1990 ఆ సమయంలో... ఢిల్లీ లో అధికారాన్ని దక్కించుకుంది బిజెపి పార్టీ. ఈసారి గెలిస్తే... దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బిజెపి అందుకుంటుందన్నమాట. ఇక ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం... బిజెపి పార్టీ 39 స్థానాలలో లీడింగ్ సంపాదించుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు 29 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.
అదే సమయంలో... ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. అయితే ఇక్కడ కౌంటింగ్ జరిగిన పోస్టులు బ్యాలెట్ ఓట్లలో... అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ప్రస్తుత ఢిల్లీ సీఎం అతీషి, మనీష్ సిసోడియా... ఇద్దరు కూడా వెనుకంజ లో ఉన్నారు. ఈ ముగ్గురు లీడర్లపై బీజేపీ నేతలే... లీడింగ్ సంపాదించడం గమనార్హం.