ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు ఈ రోజున వెలబడును ఉన్నాయి.దీంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరో ఈరోజు తెలియబోతోంది .అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉండడంతో మూడంచేల భద్రత కూడా అక్కడ ఏర్పాటు చేసి మరి ఓట్లు లెక్కిస్తూ ఉన్నారట.. 11 జిల్లాలలోని 19 కేంద్రాలలో కౌంటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి అరవింద్ క్రేజీవాల్ నేతృత్వంలోనే అమ్ ఆద్మీ పార్టీ మూడవసారి గెలుస్తుందా లేదా రాజధానిలో బిజెపి పార్టీ అధికారాన్ని చేపట్టుతుందా అనే విషయం ఇప్పుడు అందరిని ఆసక్తికరంగా కలిగించేలా చేస్తోంది.


అయితే ఈ సమయంలోనే గత రెండు ఎన్నికలలో ఒక సీటు కూడా గెలుచుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల పైన కొంతమేరకు ఆశలు పెట్టుకున్నదట. అయితే ఢిల్లీ ఎన్నికలలో ఈసారి ఓటింగ్ శాతం విషయానికి వస్తే తొలిసారిగా పురుషులకంటే మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ వేశారట.. మహిళా ఓటర్లు 60.92% ఓటింగ్ వేయక పురుషులు 60.21% ఓటింగ్ వేశారట దీన్నిబట్టి చూస్తే కొంత మేరకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు వినియోగించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ అన్ని ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోని మహిళలే లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించారు.



మహిళ సన్మాన యోజన పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క మహిళకు కూడా 2100 రూపాయలు అందిస్తామంటూ AAP హామీ ఇచ్చింది.. అలాగే ఆటో, ట్యాక్సీ ఇతరత్న డ్రైవర్ల కుమార్తె వివాహాలకు కూడా లక్ష రూపాయలు సహాయం చేస్తామని.. ఉచిత కోచింగ్, జీవిత బీమా వంటి పథకాలను కూడా అందిస్తామంటూ తెలిపారట.. అలాగే బిజెపి తన మ్యానిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు 2,500 నగదు తో పాటుగా.. 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ వంటి హామీలను ఇచ్చారట. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు 2500.. అలాగే వంట గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తామని.. అలాగే ఉచిత రేషన్ కిట్టు ఇస్తామంటూ ప్రకటించారట. మరి ఇలాంటి సందర్భంలో మహిళలు ఎవరికి మద్దతు తెలిపారు ఎవరిని గెలిపించాలని విషయం మరికొన్ని గంటలలో తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: