![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/congress-party-delhi-politics-failures9487274c-f769-477a-b7af-25c4fa0882cb-415x250.jpg)
ఢిల్లీలో మొత్తం మీద 70 స్థానాలకు గాను బిజెపి పార్టీ 45, AAP పార్టీ 24 స్థానాలలో ఆదిత్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ల దేశ చరిత్ర నుంచి ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్కే స్థానంలో ఆదిత్యంలో ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ కూడా బిజెపికి కానీ, AAP పార్టీకి కానీ పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. లోక్సభ ఎన్నికలలో పుంజుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కనిపించిన ఆ తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో నామమాత్రంగానే మిగిలిపోయినది.
ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోలేదనే విధంగా ఇక్కడ ఫలితాలను చూస్తూ ఉంటే కనిపిస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలలో ఒకరైన న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ తో పాటుగా మరొకనేత వెనుకంజలోనే ఉంటున్నారట. మరి కాంగ్రెస్ ను ఢిల్లీ ఓటర్లు సైతం ఎందుకు తిరస్కరించారనే విషయం తెలియడం లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఢిల్లీలో ఎదురుదె తగులుతోందని చెప్పవచ్చు. మరి ఇక మీదట నైనా సరే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా రాహుల్ గాంధీ ఏవైనా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తారా లేదా అన్న విషయం చూడాలి మరి.