చంద్రబాబు దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న నేత.. రాజకీయ చాణిక్యుడు అని చెప్పవచ్చు.. ఆయన ప్లాన్ వేస్తే ఎంతటి నాయకులైన దిగి రావాల్సిందే. అలాంటి చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన మెజారిటీ తో అధికారంలోకి వచ్చి మరోసారి సీఎం అయ్యారు. అంతేకాకుండా కేంద్రంలో  బీజేపీ అధికారం లోకి రావడానికి కీలక సూత్రధారి కూడా ఈయనే అయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు ను  మోడీ సర్కార్ అద్భుతంగా ఆదరిస్తోంది. అంతేకాదు ఢిల్లీ లో ఎలక్షన్స్ సందర్భంగా ఆయనను ప్రచారం లో పాల్గొనాలని కోరింది. దీంతో బీజేపీ విన్నపం మేరకు ఆయన ఢిల్లీ లోని షాదరా నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించి తన వాక్చాతుర్యం తో  అందరినీ ఆకట్టుకున్నారు. నియోజకవర్గం లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు.

 కాబట్టి తెలుగు లో మాట్లాడి ఓట్లు అన్ని భారతీయ జనతా పార్టీకి వేయాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వారు ఎక్కువగా ఉంటారని తెలుగువారి సత్తా ఏంటో ఈ ఎన్నికల్లో చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఈ విధంగా షాదరా నియోజకవర్గం లో  బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ తరఫున  ఆయన ప్రచారం చేశారు.. దీంతో ఈ ఎలక్షన్స్ లో చాలామంది తెలుగు ప్రజలు ఇతర ప్రజలంతా సంజయ్ గోయల్ కే ఏకధాటిగా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.. దీంతో ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న జితేందర్ సింగ్ చాలావరకు వెనుకబడిపోయారు..

 ఇప్పటికే వచ్చిన ఫలితాల ప్రకారం సంజయ్ గోయల్ గెలుపు ఖరారు అయినట్టే తెలుస్తోంది.. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మోడీ కి ఇచ్చిన మాట ప్రకారం తాను ప్రచారం చేసిన  నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.. ఇక ఈయనే కాకుండా ఈ ప్రాంతంలో బండి సంజయ్ కూడా ప్రచారం చేశారు. ఇద్దరు తెలుగు వాళ్ళ ప్రచారం సంజయ్ కు కలిసి వచ్చినట్టే తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: