ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే అన్ని ఫలితాలు దాదాపు బిజెపికే అధికారం అని తెల్చి చెప్పాయి .. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారం లోకి వస్తే ఎవరు సీఎం అవుతారని ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది .. ప్రస్తుతం వస్తున్న ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కూడా బిజెపికి అధికారం ఖాయమని చెబుతున్నాయి .. అన్నిచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వెనుకంజ‌లో ఉన్నారు .. చివరికి కేజ్రీవాల్, సీఎం అతీషి కూడా వెనకంజ‌ లో ఉన్నారు .. ఇలాంటి క్రమంలో బిజెపి అధికారంలోకి వస్తే సీఎంను ఎన్నుకోవడంమనేది అంత సులభమైన విషయం కాదు .. ఈసారి బిజెపి అధికారంలోకి వస్తే సీఎం కావాలని చాలామంది నాయకులు ముందు వరుసలో ఉన్నారు .. కానీ సీఎం పదవి ఎవరిని వివరిస్తుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.


ఇక ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున వారిలో ప్రధానంగా ముగ్గురు ఉన్నారు వారిలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ ... బిజెపి అత్యున్నత పదవులు ఇవ్వటం వెనుక ఉన్న వ్యూహాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఇది ఊహాగానాలు మాత్రమే.. ఒక్కొక్కసారి ఈ ఊహగానాలు కూడా నిజమయ్యే అవకాశం కూడా ఉంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియను ఒక్కసారి గమనిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే క్యాబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండటం పరిపాటిగా వస్తుంది .. ఇక రాజస్థాన్లో ప్రముఖ నాయకురాలు  వసుంధర రాజే , మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌లను బిజెపి తిరిగి వారిని మరోసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టలేదు .. ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా లేదా ప్రవేశ్ వర్మ  పేర్లు కన్ఫర్మ్ అయ్యే కన్ఫామ్ చేస్తుందన్న విశ్వాసం లేదు .. కానీ వీరులో ఇద్దరు డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది.


ఇదే క్రమంలో ఢిల్లీలో మహిళ అభ్యర్థిని కూడా సీఎంగా చేసే ఛాన్స్ కూడా లేకపోకపోలేదు .. ఆ పార్టీలో చాలామంది తెలివైన సమర్థులైన మహిళా అభ్యర్థులు ఉన్నారు .. వారిలో బన్సూరి స్వరాజ్, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ పేర్లు కూడా బీజేపీ పరిశీలిస్తుందని అంటున్నారు .. ఈ ముగ్గురు మహిళ నేతలు ఎవరు బిజెపిలో సమర్థులుగా ప్రజల్లో ప్రజాధరణ పొందిన నాయకులగా గుర్తింపు తెచ్చుకున్నారు .. వీరిలో ఎవరినైన‌ ముఖ్యమంత్రి అయితే బిజెపికి ఎంత ప్రయోజనం ఉంటుంది ..  ఢిల్లీలో పంజాబీ, పూర్వాంచలి, జాట్-గుజ్జర్  రాజకీయాలు ,  వర్గ పోరాటాలు అంతమవుతాయి .. అలాగే ఢిల్లీలోని మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మద్దతుగా ఉన్నారు .. దీని ద్వారా ఓ మహిళ ముఖ్యమంత్రి చేస్తే భవిష్యత్తులో ఆ ఓటు బ్యాంకు బిజెపికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మరి కేంద్ర‌లో ఉన్న పెద్దలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా వీరిలో ఎవరిని ఎన్నుకుంటారు అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆకాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp