ఈ రోజున ఢిల్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది.. దీంతో అక్కడ ప్రజలతో పాటు దేశమంతటా కూడా రాజధాని ప్రాంతంలో ఏ పార్టీ అధికారం సాధిస్తుందని విషయం పైన చర్చించుకుంటున్నారు. అయితే ఓట్లు లెక్కింపు మొదలుపెట్టిన గంటకు పైగా స్థానాలలో బిజెపి పార్టీ 50 స్థానాలలో దూకుడు ప్రదర్శించింది. దీంతో బిజెపి పార్టీ అధికారం వైపుగా ముగ్గు చూపుతోంది అనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ గడిచిన 30 నిమిషాల క్రితం ఒక్కసారిగా బిజెపి దూకుడు తగ్గినట్టుగా కనిపిస్తోందట.



ప్రస్తుతం బిజెపి మెజారిటీ సంఖ్య 41 యొక్క స్థానాలకి తగ్గిపోయిందని ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల నుంచి 28 స్థానాలకు పుంజుకున్నట్టుగా కనిపిస్తోందట. అంతేకాకుండా చాలా చోట్ల అభ్యర్థులు ఆదిత్యాలు కూడా కేవలం 500 నుంచి 1000 ఓట్ల మధ్య ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రతి రౌండ్ కూడా ముగిసేసరికి నెంబర్లు అటూ ఇటూ గానే మారుతున్నాయి తప్ప పెద్దగా మెజారిటీ రాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ముస్లిం ఆదిపత్య నియోజకవర్గం ఢిల్లీలో చాలా కీలకంగా మారబోతున్నాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


మరి పూర్తి ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరు ఎలాంటి మెజారిటీతో గెలుస్తారు అనే విషయం చెప్పేలా కనిపిస్తోందట. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు..AAP హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం కోసం గురుపెట్టినప్పటికీ మరి బిజెపి పార్టీ 27 ఏళ్ల చరిత్రను తిరగరాసే విధంగా ప్లాన్ చేసింది.. మరి ఎవరు ఢిల్లీ సీఎంగా ఉంటారనే విషయం మరి కొన్ని గంటలలో తెలియబోతోంది. ప్రతి గంటకి కూడా నెంబర్ల సంఖ్య మారుతూనే ఉన్నది. మరి మహిళా ఓటర్లను అక్కడ ఆకర్షించేందుకు పలు రకాల పథకాలను కూడా ప్రదర్శించడం జరిగింది అన్ని పార్టీలు. మరి మహిళలు పురుషులు ఎవరికి ఓటు వేశారన్నది తెలియబోతోంది. ఎవరు అధికారం చేపట్టినా కూడా పథకాలను అమలు చేసి తీరాల్సిందే అనే పరిస్థితి కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: