ఆంధ్రప్రదేశ్ లో గత 2024 ఎన్నికలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వైసీపీ పార్టీ, కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య హోరా హోరి పోటీ జరిగింది.. అయితే అప్పట్లో సిద్ధం సభలతో గెలుపు పై వైసీపీ పార్టీ ఎంతో ధీమా వ్యక్తం చేసింది.. ఎన్నికల ముగిసాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో సైతం వైసీపీ భారీ విజయం సాధిస్తుంది అని 160 కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటుంది అని చాలా సర్వే సంస్థలు తెల్చేసాయి.. అయితే కేకే సర్వే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని 145 స్థానాలకు పైగా సీట్లు సాధిస్తుందని సంచలనమైన సర్వే రిపోర్ట్ ఇచ్చారు.. అయితే ఆ సమయంలో కేకె సర్వే ఎవరూ పట్టించుకోలేదు ఎన్నికలు ఫలితాలు విడుదల అయ్యాక అందరూ కంగుతిన్నారు..కూటమి ఏకంగా 164 సీట్లు సాధించడంతో వైసీపీ పార్టీ అధికారులు షాక్ అయ్యారు.. రాష్ట్రంలో కేకే సర్వే సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.. ఎన్నికలు ముగిసాక అన్ని సర్వే సంస్థలు ఈ సారి ఢిల్లీలో బీజేపీ పాగా వేస్తుందని తెలిపాయి.కానీ సంచలన కేకే సర్వే మాత్రం న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొంటుందని క్లియర్ కట్‌గా చెప్పేసింది..మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 39 ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని కేకే సర్వే స్పష్టం చేస్తుంది. ఇక బీజేపీ మాత్రం 22 స్థానాలనకే పరిమితం అవుతుందని తెలిపింది. అలాగే 9 స్థానాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య పోరు రసవత్తరంగా జరగనుందని తెలిపింది.

 తాజాగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది..కానీ కేకే సర్వే కి భిన్నంగా బీజేపీ లీడింగ్ లో కొనసాగుతుంది.. ఢిల్లీ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి మరి బీజేపీ లీడింగ్ లో కొనసాగుతుంది.. ఈ సారి ఎలాగైనా అధికారం పొందాలనే దృఢ నిశ్చయంతో బీజేపి వుంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందటంతో గెలుపు పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. M

మరింత సమాచారం తెలుసుకోండి: