ఆ తర్వాత అసలు ఆట మొదలైంది. ఈ ముగ్గురు బడా లీడర్లు లీడింగ్ లోకి కూడా వచ్చారు. అదే సమయంలో బిజెపి పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసి 50 సీట్లను గెలుచుకునే దిశగా లీడింగ్ సంపాదించింది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 24 సీట్లు మాత్రమే లీడింగ్ లో కనిపించాయి. దీంతో మరో గంటలో... ఢిల్లీ ఎన్నికల హడావిడి అయిపోతుందని... బిజెపి 26 సంవత్సరాల తర్వాత విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ చివరి క్షణంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9 అసెంబ్లీ స్థానాలలో... రసవత్తర పోరు జరుగుతుంది. ఈ తొమ్మిది స్థానాలలో... కేవలం వందల ఓట్లు మాత్రమే అభ్యర్థుల మధ్య తేడా ఉంది. ఒక ఓటు అటు అయినా లేదా ఇటు అయినా... ఫలితాలు మొత్తం తారుమారు కావడం గ్యారెంటీ. మొదట్లో 50 సీట్లకు పైన లీడింగ్ లో ఉన్న బిజెపి ఇప్పుడు 41 స్థానాలకు పడిపోయింది.
అటు ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో లీడింగ్ స్పష్టంగా సాధించి ముందుకు వెళ్తోంది. ఇక మిగిలిన 9 స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇందులో... ఆమ్ ఆద్మీ పార్టీ... ఏడు సీట్లు గెలిస్తే... బిజెపికి ఎదురు దెబ్బ తప్పదని చెప్పవచ్చు. ఒకవేళ ఇదే 9 సీట్లలో బిజెపి క్లీన్ స్వీప్ చేస్తే.. అప్పుడు బిజెపికి 50 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ... ఆమ్ ఆద్మీ అలాగే బిజెపి పార్టీ అభ్యర్థుల మధ్య కేవలం 100 ఓట్ల తేడా మాత్రమే ఉందట. ఇలా 9 నియోజకవర్గాలలో... ఇదే పరిస్థితి. కాబట్టి ఈ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా మారింది.