ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. బడా నేతలందరూ ఓడిపోయారు. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో దారుణంగా ఓడిపోయారు అరవింద్ కేజిరివాల్. బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు అరవింద్ కేంద్రీవాల్. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.


ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ నుంచి... చివరి వరకు అరవింద్ కేజ్రీవాల్‌ వెనుకంజలోనే కొనసాగారు.  కానీ మధ్యలో కొన్ని రౌండ్లు... బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ కంటే లీడింగ్ సంపాదించారు. కానీ చివరికి వచ్చేసరికి 3000 ఓట్ల తేడాతో పర్వేష్ సాహిబ్ సింగ్  చేతిలో ఓడిపోయారు అరవింద్‌ కేజ్రీవాల్‌.  న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్...  చివరి క్షణంలో ఓడిపోవడం జరిగింది. ఇక్కడి నుంచి దాదాపు మూడుసార్లు... అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు.


కానీ నాలుగో సారి మాత్రం... న్యూఢిల్లీ నియోజకవర్గం ప్రజలు... ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ను తిరస్కరించారు. లిక్కర్ స్కాం, వాటర్ స్కాం ఇలా చాలా స్కామ్ ల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఢిల్లీ ప్రజలు... విసిగిపోయి బిజెపికి ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతుంది.  ఇక అరవింద్ కేజ్రీవాల్ తో పాటు... ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు.


ఆయన కేవలం 600 ఓట్ల తేడాతో... జంగ్‌ పూరా నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. ఈ నియోజక వరంగంలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు సిసోడియా. ఇక ఈ విజయంతో.. బీజేపీ పార్టీ ఉత్సవాలు చేసుకుంటున్నాయి.  అయితే... అనుహ్యంగా కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. ఆమె ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ.. చివరకు కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: