ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ ను అడ్డుకుని 26 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి అడుగులు వేస్తుంది .. ప్రస్తుతం నడుస్తున్న ఓట్ల లెక్కింపులో ముందు నుంచి తన ఆధిపత్యాన్ని చాటి చెబుతుంది బిజెపి .. భారీ విజయం నమోదు చేసుకుని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి .. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా నాలుగైదు శాతమే కనిపిస్తున్న సీట్ల విషయంలో మాత్రం భారీ తేడా ఉంటుంది .. అయితే ఇంత పెద్ద భారీ తేడాతో ఆప్ ఓటమిపాలవుతుండటం వెనుక మూడు కీలక విషయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన అంశం ప్రజా వ్యతిరేకత .. దశార్థకాలంగా ఢిల్లీని పాలిస్తున్న కేజ్రివాల్ ప్రభుత్వం .. ఈ 10 సంవత్సరాల్లో విద్య , వైద్యం రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది.  అలాగే విద్యుత్ తాగునీటి సబ్సిడీలు కూడా అక్కడి ప్రజలను ఆనందంగానే ఉంచాయి ..


అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది కేజ్రీవాల్ సర్కార్ .. ఈ విషయంపై కేంద్రంపై నెపం నెట్టేసింది .. అలాగే ఢిల్లీకి తాను ఏం చేయాలన్న కేంద్రం అడ్డుపడుతుందంటూ కేజ్రివాల్ పదే పదే ఆయన చేసిన విమర్శలు నమ్మిన ఓటర్లు ఇక చేసేది లేక అదేదో బిజెపికి అధికారం ఇచ్చేద్దామని భావించారని ఫలితాలు చెబుతున్నాయి .. ప్రధానంగా ఢిల్లీలో అభివృద్ధి విషయంలో కేజ్రివాల్ ప్రజలకు ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రజల్లో అలాగే ఉండిపోయింది. మరోవైపు ఢిల్లీలోని ఆప్ స‌ర్కార్ తో పాటు ముఖ్య నేతలకు మచ్చ తెచ్చిన అంశాల్లో ముఖ్యమైనది లిక్కర్ స్కాం.. 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ సిబిఐ , ఈడి పదేపదే కేసుల నమోదు చేసి సీఎం కేజ్రివాల్ తో పాటు ఆప్ కీలక నాయకులందరినీ జైలుకు పంపారు .. అలాగే ఇందులో 100 కోట్లు ఎక్కడికి వెళ్ళింది అన్నది కూడా సిబిఐ , ఈడి నిరూపించలేకపోయిన కోర్టులు మాత్రం వీరిని సుదీర్ఘంగా జైల్లో ఉంచేందుకు అనుమతించాయి ..


చివరిగా ఇదే వారిపై మచ్చను నిజం చేసింది .. ఈ కేసులో ఆప్ నేతలపై ఉన్న అభియోగాల్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు నిరూపించలేకపోయాయి .  కానీ ప్రజల్లో మాత్రం వారు అవినీతిపరులుగా ముద్ర వేసాయి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ (సాధారణ ప్రజల్లో ఒక్కడు) గా పార్టీ పెట్టి విజయం సాధించిన అరవింద్ కేజ్రివాల్ .  ఆ తర్వాత కూడబెట్టుకున ఆస్తులు ముఖ్యంగా విలాసవంతమైన భవనం అందులో వస్తువులన్నీ బిజెపి శీష్ మహాల్ రూపంలో జనలోకి తీసుకువెళ్లింది .. ఇక దీంతో కేజ్రీవాల్ పై ఉన్న ఆమ్ ఆద్మీ ముద్రను పోగొట్టి ఢిల్లీ వంటి రాజధాని నగరంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఆమాత్రం ఇల్లు వస్తువులు ఎందుకు ఉండవని జనం ఆలోచించలేదు .. కేజ్రీవాల్ ఇంకా ఆమ్ ఆద్మీ గానీ భావిస్తూ ఆయన మారిపోయారని భావించారు .. దీంతో బిజెపి ఆరోపాలన్నీ జనం నమ్మి కేజ్రీవాల్ పాటు పార్టీని గంగలోకి తోసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: