![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-delhi999975ae-7b30-4252-8855-3c85f296f906-415x250.jpg)
ఇక గతంలో ఎప్పుడు ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికలపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టలేదు .. ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకోవాలని పట్టుదలతో ఎంతో కష్టపడ్డారు .. ఇక ఇప్పుడు చివరకు ఎన్నికల ఫలితాల్లో బిజెపికి అనుకూలంగా రావటంతో మూడు దశాబ్దాల తర్వాత బిజెపి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోబోతుంది .. దేశవ్యాప్తంగా బిజెపి సంచలన విజయాలు నమోదు చేస్తున్నప్పటికీ .. ఢిల్లీలో సరైన నాయకత్వలేమి ఆ పార్టీని ఎప్పటినుంచో వెంటాడుతుంది .. 1993లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో బిజెపి ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చింది .. ఆ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరైనా చర్చ జోరుగా సాగుతున్న వేళ బీజేపీ అధిష్టానం ఎవరు వైపు మొగ్గు చూపుతోందో ఇక్కడ తెలుసుకుందాం.
ఇక ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాదు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్నికల్లో ఓడించింది బిజెపి .. ఆఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ పోటీ చేసి విజయం అందుకున్నరు .. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థున్ని ప్రకటించినప్పటికీ పర్వేష్ సాహిబ్ సింగ్ ముఖ్యమంత్రి అవుతడనే ప్రచారం ఘట్టిగా జరుగుతుంది .. ప్రధానంగా జాట్ సామాజికవర్గానికి చెందిన ఆయనను సీఎం చేస్తారని ప్రచారం ద్వారా ఆ సామాజిక వర్గం ఓటులను బిజెపి ఎక్కువగా ఆకర్షించింది .. ఇక ఇప్పుడు పర్వేష్ కేజ్రీవాల్ పై విజయం సాధించడంతో పర్వేష్ కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు పర్వేజ్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం పర్వేష్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బిజెపి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.