ప్రస్తుతం నడుస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి .. బిజెపి ప్రబంజ‌నం కనిపించింది ఆ పార్టీ అభ్యర్థుల మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.  ఆమ్ ఆద్మీ వెనుకబడినట్టే ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఎలాంటి ఫలితం లేదు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 .. ఇక 2013లో తొలిసారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు అక్కడ చెక్కుచెదరలేదు ఆ పార్టీ ఓటు బ్యాంకు .. ఇక ఇప్పుడు ఆ పార్టీ ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి .. దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి .. బిజెపి క్లిన్ స్వీప్ దిశగా నడుస్తుంది.


ఫలితాలు వస్తున్న కొద్ది బీజేపీలో జోష్ పెరిగిపోతుంది .. ఈరోజు ఉదయం నుంచి ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు .. ఉదయం నుంచి బాణాసంచా కాల్చడం స్వీట్లు పంచి పెట్టడం మొదలుపెట్టారు .. ఇక ఢిల్లీలో కాషాయ‌ జెండాల‌ను ఎగుర‌వేశారు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ఢిల్లీ ప్రజలు జై కొట్టారు. అయితే మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీలో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది.  పార్టీ కార్యాలయం మోగపోయింది .. ఎక్కడ జనం లేక బోసిగా కనిపించింది .. అటు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసం కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. ముందుగా బాణాసంచా పార్టీ జెండాలతో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం , అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కనిపించిన నాయకులు , కార్యకర్తలు ఫలితాలు వెలుబడుతున్న కోద్ది నిరాశ నిస్పృహలకు గురయ్యారు ..


కేజ్రీవాల్ , అతిషి, మనిష్ సిసోడియా వంటి హేమ హేమల సైతం వెనకంచిలో ఉండటంతో అవేద‌న‌కు గురయ్యారు గుంపు గుంపులగా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఈ హడావుడి మధ్య ఓ 9 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఎంతో ఆకర్షించాడు .. అతని పేరు అవ్యాన్ తోమర్ .. అచ్చం అరవింద్ కేజ్రీవాల్‌ని  తలపించేలా డ్రస్ తో సందడి చేశారు .. కళ్ళజోడు ధరించాడు కేజ్రీవాల్ త‌ర‌హ జర్కిన్‌ వేసుకుని ఆయన ఇంటి వద్ద సందడి చేశాడు .. అతని తల్లితండ్రుల  ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు. తీరా పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడంతో చోటా కేజ్రీవాల్ తీవ్ర దుక్కంలో మునిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: